కలం, వెబ్ డెస్క్ : హార్మూజ్ జలసంధి వేదికగా సాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యూహాత్మక జలసంధిని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి, అంతర్జాతీయ నౌకాయానాన్ని పునరుద్ధరించడానికి ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. హార్మూజ్ జలసంధి రక్షణ కోసం తక్షణమే తమ యుద్ధ నౌకలను పంపాలని చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదే సమయంలో ఇరాన్ మిలిటరీ సామర్థ్యంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ మిలిటరీ శక్తులను అమెరికా వంద శాతం నాశనం చేసిందని తెలిపారు. హార్మూజ్ జలసంధిని త్వరలోనే పూర్తిగా తెరిపిస్తామని, అక్కడి నుంచి అంతర్జాతీయ రవాణా ఎటువంటి ఆటంకాలు లేకుండా యథావిధిగా సాగేలా పటిష్ట చర్యలు తీసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, ట్రంప్ (Donald Trump) పిలుపునకు ఇప్పటికే సానుకూల స్పందన వస్తోందని, పలు దేశాలు అమెరికాకు మద్దతుగా తమ యుద్ధ నౌకలను పంపేందుకు వేగంగా సన్నాహాలు చేసుకుంటున్నాయని సమాచారం.

