Mobile Popup Ad
Mobile Popup Ad

ప‌ని మ‌నుషులుగా చేరి రూ.2 కోట్లు దోచుకెళ్లారు!

క‌లం, వెబ్ డెస్క్‌: హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ (Jubilee Hills)లో భారీ చోరీ వెలుగుచూసింది. ప‌ని మ‌నుషులుగా చేరిన ఓ నేపాలీ జంట ఇంట్లో ఎవ‌రూ లేని టైం చూసి న‌గ‌ల‌తో ఉడాయించారు. కొన్ని నెల‌ల క్రితం జూబ్లీహిల్స్‌లో ప‌ని కోసం వెతుకుతూ నేపాలీ దంప‌తులు ఓ ఇంటికి వ‌చ్చారు. య‌జ‌మాని ఇద్ద‌రికి ప‌ని ఇచ్చి, ఇంట్లోనే ఉండే ఏర్పాట్లు చేశారు. కొన్ని రోజులు న‌మ్మ‌కంగా ప‌ని చేసిన జంట ఇటీవ‌ల యజమాని లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేశారు. ఇంట్లో ఉన్న‌ 8 డైమండ్ నెక్లెస్‌లు, బంగారు ఆభరణాలు, 10 రోలెక్స్ వాచీలను దోచుకొని పరారయ్యారు. ఇంటికి తిరిగి వ‌చ్చాక దొంగ‌త‌నం జ‌రిగింద‌ని గుర్తించిన య‌జ‌మాని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. దొంగిలించిన వస్తువుల విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని స‌మాచారం. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>