సరికొత్త ఇన్నింగ్స్​ ప్రారంభించిన ఇండియన్​ బౌలర్​ !

కలం, వెబ్​ డెస్క్​: టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఒక ఇంటివాడయ్యారు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షిక చద్దాతో కలిసి ఆయన ఏడడుగులు వేశారు. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ వేదికగా వీరి వివాహ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో కుల్దీప్, వన్షికలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

ఈ వేడుకకు భారత క్రికెట్ జట్టుకు చెందిన పలువురు సహచర ఆటగాళ్లతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) మైదానంలో తన మ్యాజిక్ స్పిన్‌తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు తన జీవితంలో సరికొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఈ స్పిన్నర్‌కు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, క్రికెట్ దిగ్గజాలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>