కలం, నిజామాబాద్ బ్యూరో: ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో తీవ్ర ఎండలు, వేడి గాలులకు సంబంధించి తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రజలకు నిరంతరం సందేశాలు వస్తుండటంతో అప్రమత్తం అవుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లవద్దని.. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని. అస్వస్థతగా ఉంటే వైద్య సాయం పొందవచ్చని కూడా సూచిస్తోంది. ఉష్ణోగ్రతలపై నిరంతరం అప్డేట్ చేస్తోంది కమాండ్ కంట్రోల్ సెంటర్. ఈ అలెర్ట్ ఎంతో బాగుందని జనాలు అభిప్రాయపడుతున్నారు.
బాల్కొండలో 46 డిగ్రీలు నమోదు..
రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నిజామాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. బాల్కొండ కేంద్రంలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత పది రోజులుగా ఎండల తీవ్రత విప రీతంగా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి తోడు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వేడిగాలుల తీవ్రత ఉండటంతో జిల్లా ఉడికిపోతోంది. దాదాపు అన్ని మండలాల్లో 44, 45 డిగ్రీల పైనే పగటి పూట ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. జిల్లాలో ప్రజలు ఎవరు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
Read Also: భూదాన్ భూముల కబ్జా.. ఖమ్మంపై ఈడీ గురి
Follow Us On: X(Twitter)

