కలం, వెబ్ డెస్క్: భారత సంతతికి చెందిన అనేకమంది అమెరికాలో ప్రమాదాల బారిన పడుతున్నారు. గత రెండు నెలల్లో అనేక కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana)కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమెరికాలో మరణించాడు. తెలంగాణలోని వనపర్తిలోని బొల్లారం గ్రామానికి చెందిన హర్షవర్ధన్ రెడ్డి (45) అమెరికాలోని ఫ్లోరిడాలో నివసిస్తున్నట్లు సమాచారం.
అమెరికా (America)లో పది సంవత్సరాలుగా ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి హర్షవర్ధన్‌కు గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. హర్షవర్ధన్ రెడ్డి తండ్రి బొల్లారం గ్రామ సర్పంచ్. హర్షవర్ధన్ రెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


