Mobile Popup Ad
Mobile Popup Ad

యుద్ధ విరమణపై ఇరాన్ సంచలన ప్రకటన..!

కలం, వెబ్​డెస్క్​ : అమెరికా (US) – ఇజ్రాయెల్ (Israel), ఇరాన్ (Iran) మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ పై అమెరికా – ఇజ్రాయెల్ దళాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ (Iran) కూడా అంతే దీటుగా జవాబిస్తోంది. గల్ఫ్ లోని అమెరికా (US) స్థావరాలపై ఇరాన్ వార్ కొనసాగిస్తోంది. ఈ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం చమురు వాణిజ్యానికి ఆటంకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాఘ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు.

అమెరికాతో పాటు దాని మిత్రదేశాలకు హార్మూజ్ జలసంధి ద్వారా రవాణాను నిషేధిస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేశారు. మిగతా దేశాలకు జలసంధి తెరిచే ఉంటుందని భరోసా ఇచ్చాడు. అటు యుద్ధ విరమణపై కూడా అబ్బాస్ అరాఘ్చీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ దాడులు చేపట్టబోమన్న హామీతో పాటు.. యుద్ధ నష్టానికి పరిహారం చెల్లిస్తే యుద్ధ విరమణ ఉంటుందని తేల్చిచెప్పారు. నష్టంపై ప్రాంతీయ దేశాల కమిటీకి తాము సిద్ధమని చెప్పారు. ప్రస్తుతం ఇరాన్ లో పాలన స్థిరంగా ఉందని ఆయన వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>