Mobile Popup Ad
Mobile Popup Ad

ఓజీ బాటలోనే ఉస్తాద్.. అందుకే పవన్ సైలెంట్

కలం, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఓజీ లాంటి హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో పాటు గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ అవుతుండటంతో మంచి అంచనాలే ఉన్నాయి. పైగా నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ లో కొన్ని సీన్లు, డైలాగులు బాగానే ఆకట్టుకుంటున్నాయి. మార్చి 19న రిలీజ్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు పెద్దగా ప్రమోషన్లు చేయట్లేదు. హరీష్ శంకర్ ఒక్కడే సాంగ్స్ ఈవెంట్లు చేసినా.. పెద్దగా హైప్ రావట్లేదు. పవన్ కల్యాణ్‌ ఒక్కసారి కూడా సినిమా గురించి మాట్లాడకపోవడంతో ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.

నేడు సాయంత్రం యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. పవన్ కల్యాణ్‌ ఎట్టకేలకు మూవీ గురించి మాట్లాడబోతున్నాడు. దీంతో పవన్ స్పీచ్ కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాకు ఓజీ సెంటిమెంట్ ను ఫాలో కావాలని పవన్ చూస్తున్నట్టు తెలుస్తోంది. ఓజీ సినిమాకు పవన్ కల్యాణ్‌ పెద్దగా ప్రమోషన్లే చేయలేదు. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి సైలెంట్ గా ఉన్నాడు.

కానీ మూవీ మంచి హిట్ కావడంతో.. ఆటోమేటిక్ గా మౌత్ టాక్ తో కలెక్షన్లు బాగానే వచ్చాయి. పవన్ కల్యాణ్‌ ప్రమోషన్లు చేస్తే సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతుంటాయి. ఒక్కోసారి సినిమా కంటెంట్ పర్లేదన్నట్టు ఉన్నా అంచనాలను అందుకోలేక ఆ మూవీలు ప్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయి. కాబట్టి ఉస్తాద్ మీద విపరీతమైన అంచనాలు పెంచడం కంటే.. సైలెంట్ గా ఉండి కంటెంట్ తోనే సమాధానం చెప్పాలని పవన్ ప్లాన్ చేస్తున్నారంట. ఓజీ విషయంలోనూ ఇదే జరిగింది. ఓజీపై అంచనాలు పెంచకపోవడం వల్లే.. కంటెంట్ ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత పవన్ తన రాజకీయాల్లో బిజీగా ఉండబోతున్నారు. రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ కు నచ్చితే ఆటోమేటిక్ గా కలెక్షన్లకు ఢోకా ఉండదని పవన్ భావిస్తున్నారు. మరి ఓజీ ప్లాన్ ఉస్తాద్ కు వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>