కలం, వెబ్ డెస్క్: తెలంగాణ పోలీసుల (Telangana Police) తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “పోలీసులు పౌరులతో వ్యవహరించే విధానం ఇదేనా?” అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఓ యువకుడికి సంబంధించిన బైక్ తాళాలు బలవంతంగా లాక్కొని.. ‘బైక్ ధ్వంసం చేస్తాం.. మంటల్లో తగలబెడతాం ‘ అంటూ బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులకు బైక్ సీజ్ చేసే అధికారం లేదని ఇటీవల హైకోర్టు ఆదేశాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. పోలీసుల తీరు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ఉందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోస్టులో డిమాండ్ చేశారు. పోలీసులు (Telangana Police) ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల వెర్షన్ ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఈ ఘటన ఏ ప్రాంతంలో జరిగింది? సదరు పోలీసులు ఎవరు? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: ఇంధన పొదుపు చర్యలు.. వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్
Follow Us On: Sharechat

