కలం, వెబ్ డెస్క్ : ప్రధాని మోదీ (PM Modi) ఇంధన పొదుపు పిలుపులో భాగంగా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు పొదుపు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ (Delhi) ప్రభుత్వం ఇంధన పొదుపు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కార్పొరేట్ కార్యాలయాలకు, సంస్థల ఉద్యోగులకు వారానికి రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని ఢిల్లీ కార్మిక శాఖ సూచనలు జారీ చేసింది. ఆఫీస్ టైమింగ్ లో మార్పులు, కార్ పూలింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు పై ఆదివారం ఆ రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది.
అత్యవసర సేవలు అయిన వైద్య, ఆరోగ్య సంస్థలు, విద్యుత్, నీరు, మున్సిపల్ శాఖ, పారిశుధ్యం లాంటి వాటివీ ఈ అడ్వైజరీ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. కాగా, దేశంలో అత్యధికంగా వాహనాల వినియోగంలో రాజధాని ఢిల్లీ (Delhi) ముందు వరుసలో ఉందనే విషయం తెలిసిందే. ఈ కారణంగానే హస్తిన వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది.
Read Also: కవలలకు జన్మనిచ్చిన ఏనుగు.. ఉత్తరాఖండ్‌లో అరుదైన ఘటన
Follow Us On : WhatsApp

