భారత్‌లో ఎన్నికలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌లో ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇటీవలే భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారని మా అధికారులను అడిగారు. ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండానే ఎలక్షన్స్ పెట్టడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇండియాలో గత ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓట్లు వేశారు. వీరిలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ప్రతి ఓటరు కచ్చితంగా ప్రభుత్వం అందించిన ఏదో ఒక గుర్తింపు కార్డును కలిగి ఉన్నారు. అమెరికా కూడా ఇప్పుడు సేవ్ అమెరికా యాక్ట్ ఆమోదించాల్సిన అవసరం ఉంది’ అని తన ట్రూత్ పోస్టులో వెల్లడించారు.

‘సేవ్ అమెరికా యాక్ట్’‌లో ఏముంది..

అమెరికా ఎన్నికల విధానంలో మార్పులు రావాలని ట్రంప్ కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. అందుకు సేవ్ అమెరికా యాక్ట్ తీసుకొస్తానని స్పష్టం చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం, ప్రతి ఓటర్ తాను అమెరికా పౌరుడేనని నిర్ధారించే గుర్తింపు కార్డ్ కలిగి ఉండాలి. దీని ద్వారానే, అతడికి ఓటర్ ఐడీ కార్డ్ కూడా జారీ అవుతుంది. మెయిల్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌పైనా కఠినమైన ఆంక్షలు ఉండాలి. భారత్‌లో మాదిరి కచ్చితంగా ఎన్నికల వ్యవస్థ కోసమే ప్రత్యేకంగా ఐడీ కార్డ్ కూడా ఉండాలని చెబుతున్నారు. అయితే, దీనిపై అమెరికా కాంగ్రెస్ పలు అభ్యంతరాలు లేవనెత్తడంతో ఇంకా బిల్లు ఆమోదం పొందడం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>