Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు (Inter Supplementary Exam) రాయనున్న విద్యార్థలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సప్లిమెంటరీ ఫీజు గడువును మే 4 వరకు రాష్ట్ర విద్యాశాఖ పొడిగించింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థులు మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు ఆలస్య రుసుము రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించింది. ఇదే చివరి అవకాశమని.. విద్యార్థులు వెంటనే స్పందించి పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది.

ఇదివరకే సప్లిమెంటరీ పరీక్షల (Inter Supplementary Exam) షెడ్యూల్ ను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయని పేర్కొంది. పరీక్షలను ప్రతిరోజూ రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం సెషన్ మార్నింగ్ 9:00 గంటల నుంచి నుండి మధ్యాహ్నం 12:00 వరకు, మధ్యాహ్నం సెషన్ మ. 2:00 గంటల నుంచి సాయంతం 5:00 గంటల వరకు ఉండనుంది. థియరీ పరీక్షలు ముగిసిన వెంటనే.. మే 22 నుంచి 25వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Read Also: బీజేపీని కార్నర్ చేసేందుకు కాంగ్రెస్‌కు అస్త్రం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>