కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) లోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ (MG University) పరిధి విద్యార్థులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంజీ వర్సిటీలో కొత్తగా లా (న్యాయవిద్య), ఫార్మసీ (Pharmacy) కోర్సులను ఏర్పాటు చేస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు కోర్సులు 2026-27 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఎంజీలో యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లా ఏర్పాటుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మూడేళ్ళ ఎల్ఎల్‌బీ (LLB) కోర్సు ప్రారంభం కానుంది. ఈ కోర్సుల్లో రెండు సెక్షన్లలో కలిపి 120 మంది విద్యార్థులకు ప్రవేశం దక్కనుంది.
ఎల్ఎల్ఎం (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా) కోర్సులో 20 మంది విద్యార్థులకు ప్రవేశం దక్కనుంది. ఈ కోర్సు నిర్వహణ కోసం టీచింగ్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల కోసం సర్కారు రూ.3.52 కోట్లు మంజూరు చేసింది. మరోవైపు వర్సిటీలో (MG University) ఫార్మసీ విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఫార్మసీలో నాలుగేళ్ల బీఫార్మసీ కోర్సులో 60 సీట్లకు అవకాశం కల్పించారు. ఈ కోర్సు నిర్వహణ, సిబ్బంది వేతనాల కోసం ప్రభుత్వం మరో రూ.4.06 కోట్లు కేటాయించింది. రెండు కోర్సుల ఏర్పాటు కోసం తదుపరి చర్యలు తీసుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు సంఘాలు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Read Also: ఈయూ డీల్: చాక్లెట్స్ To లగ్జరీ కార్స్.. ఇండియాలో ఇక డెడ్ చీప్
Follow Us On: Pinterest


