కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా కేంద్రంలో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ & సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ తరలింపుపై వివాదం నెలకొంది. ఈ కార్యాలయం పటాన్‌చెరు మండలం కర్ధనూర్ గ్రామంలో కొత్తగా నిర్మించబోతున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాంప్లెక్స్‌లోకి తరలించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా కేంద్రం కావడంతో అన్ని ముఖ్య కార్యాలయాలు ఇక్కడే కొనసాగాయి. రిజిస్టర్ ఆఫీసు వేరే ప్రాంతానికి తరలించడంపై స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కార్యాలయ సేవల కోసం వెళ్లే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని, అదనపు ఖర్చులు భరించాల్సి వస్తదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ తరలింపుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి (Sangareddy) ఇంటి గ్రేటెడ్ రిజిస్ట్రేషన్ (Registration) ఆఫీసు కాంప్లెక్స్ మరో చోటికి తరలిస్తే ఊరుకునేది లేదని, అధికారులు ఆలోచించి మళ్లీ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ అంశంపై మంత్రులతో మాట్లాడేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారాయన. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సైతం స్పందించారు. కార్యాలయాన్ని తరలించొద్దని మంత్రి పొంగులేటికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు కాంప్లెక్స్ తరలింపుపై సందిగ్ధత నెలకొంది.
Read Also: పోలీస్ విధుల కేటాయింపులో AI వినియోగం
Follow Us On: Sharechat


