కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ (Telangana Cabinet) సమావేశం ఈ నెల 4వ తేదీన జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి పలు కీలక అంశాలపై మంత్రి వర్గం చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇటీవలే ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో వారికి ఇచ్చిన హామీల అమలు గురించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై..
పెండింగులో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ఆలస్యమవుతున్న నేపథ్యంలో.. ఎప్పుడు నిర్వహించాలనేదే కూడా డిసైడ్ చేయబోతున్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఈ నెల 7వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి తుమ్మిడిహెట్టిలో పర్యటించబోతుండగా.. భూ సేకరణ, డీపీఆర్ తదితర అంశాలపై కూలంకషంగా కేబినెట్ (Telangana Cabinet) మీటింగ్ లో చర్చించబోతున్నారు.
Read Also: పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి పొంగులేటి
Follow Us On: Sharechat

