కలం సినిమా : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఈ మధ్య కాలంలో చేసిన లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. ఖుషి సినిమా అయినా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందిస్తుంది అనుకుంటే.. జస్ట్ యావరేజ్ గా నిలిచింది. ఇక కింగ్డమ్ సినిమా అయినా బ్లాక్ బస్టర్ ఇస్తుందనుకున్నా.. అది కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో విజయ్ కెరీర్ కష్టాల్లో పడింది. ఇప్పుడు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయ్ ఇప్పుడు వరుసగా రెండు ప్రాజెక్టులు చేస్తున్నాడు.
యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ “రౌడీ జనార్థన” (Rowdy Janardhana) అనే బిగ్గెస్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ భారీ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో విజయ్ దేవరకొండ డైలాగ్స్, లుక్స్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. రవి కిరణ్ కోలా ఈ కథపై ఛాన్నాళ్లు కసరత్తు చేశాడు. రౌడీ ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ ఐటం సాంగ్ ఉంటుందని తెలుస్తుంది. ఆ సాంగ్ ను మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah) తో చేయించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. జైలర్ మూవీలో తమన్నా ఐటం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ సూపర్ హిట్ అయింది. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన కూడా తమన్నా ఐటం సాంగ్ చేస్తే ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. పైగా ఈ అమ్మడు ఐటం సాంగ్ చేసిన సినిమాలు సక్సెస్ అవ్వడంతో మూవీకి కూడా మరింత బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
Read Also: అందుకే తప్పుకున్నా.. కమల్, రజినీ మూవీపై లోకేశ్ కనగరాజ్ క్లారిటీ
Follow Us On: Sharechat


