కలం, వెబ్ డెస్క్ : ఆదివారం వచ్చిందంటే చాలు ముక్కా, చుక్కా ఉండాల్సిందే. కానీ, ఈరోజు మాంసాహారం తినడం అశుభం కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడి జన్మదినం నేడు. భాస్కరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆదివారం రోజే రథసప్తమి (Ratha Saptami) రావడం విశేషం. అందుకే నేడు కొన్ని నియమాలు తప్పక పాటించాలని పండితులు చెబుతున్నారు. ఆదిత్యుడి ఇష్టమైన రోజుతో పాటు.. ఆయన జన్మదినం కావడం వల్ల ఈ రోజు నాన్ వెజ్ (Non – Veg) తినడం, మద్యం తీసుకోవడం మంచిది కాదంటు హెచ్చరిస్తున్నారు. జుట్టు, గోర్లు కత్తిరించుకోవడం అశుభం అని చెబుతున్నారు.
రథసప్తమి (Ratha Saptami) రోజున ఆదిత్య హృదయ స్తోత్రం పఠించాలని పండితులు సూచిస్తున్నారు. సూర్యారాధన వల్ల అసాధ్యమైన పనులు కూడా సాధ్యం అవుతాయని నమ్మకం. రామాయణ యుద్ధ సమయంలో రాముడికి అగస్య మహర్షి ఆదిత్య హృదయం బోధించారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే, పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు సూర్యారాధన చేయడం వల్ల అక్షయ పాత్రను పొంది అతిథి సత్కారాలు చేయగలిగారని చెబుతుంటారు.
ఆదివారం చేయకూడని పనులు..
సూర్యుడికి ఇష్టమైన రోజున కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మద్యం, మాంసం ముట్టుకోకూడదు. గోర్లు, వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. తలస్నానం చేసేటప్పుడు నూనె రాసుకోకూడదు. అలాగే, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కూడా అశుభంగా భావిస్తారు. తోలు వస్తువులు వినియోగించకూడదు. సూర్యాస్తమయానికి ముందే భోజనం ముగించాలి. ఆ తరువాత తిన్న ఆహారం వల్ల శరీరానికి నష్టం చేకూర్చుతుందంటా. ఈ నియమాలు అతిక్రమిస్తే చెబు జరిగే అవకాశాలు ఉన్నాయని పండితులు హెచ్చరిస్తున్నారు.
Read Also: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
Follow Us On: Sharechat


