కలం, వెబ్ డెస్క్: రథసప్తమి (Ratha Saptami) సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా తిరుమల (Tirumala) వేంకటేశ్వర స్వామి ఆలయం, అరసవెల్లిలోని (Arasavalli) సూర్య నారాయణ స్వామి దేవాలయం (Suryanarayana Swamy Temple)లో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుమల మాడ వీధుల్లో సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనమిస్తున్నారు. ఈ రోజు స్వామివారిని ఏడు వాహనాలపై ఊరేగించనున్నారు. అరసవెల్లిలో మూడు రోజులుగా రథసప్తమి ఉత్సవాలు జరుగుతున్నాయి. సూర్యనారాయణ స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్థానికంగా భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రథసప్తమిని (Ratha Saptami) రాష్ట్ర పండుగగా ప్రకటించాలని కోరిన వెంటనే సీఎం చంద్రబాబు అంగీకరించారని తెలిపారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అరసవెల్లికి 2 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
Read Also: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
Follow Us On: Sharechat


