Mobile Popup Ad
Mobile Popup Ad

సైబర్ నేరగాళ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : భారత్ లో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై సుప్రీం కోర్టు (Supreme Court ) స్పందించింది. అమాయక పెట్టుబడిదారులను మోసం చేసి కోట్ల రూపాయలను దోచుకుంటున్న పరాన్నజీవులపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. సైబర్ నేరారోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి వివిధ రాష్ట్రాల్లో తన పైన నమోదైన కేసులన్నింటినీ ఒకటిగా చేర్చాలని పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్ ను విచారించేందుకు నిరాకరించిన సీజేఐ సైబర్ నేరగాళ్లను (Cyber Criminals) పరాన్న జీవులతో పోల్చుతూ వారికి బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దేశంలో పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థను సైబర్ నేరగాళ్లు నాశనం చేస్తున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సైబర్ నేరగాళ్లు మోసం చేసి దొరికిపోతే వేరే రాష్ట్రాలకు వెళ్లి ప్రజలను దోచుకుంటున్నారని వారిని జైళ్లో ఉంచడమే సమంజసం అని జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) అభిప్రాయపడ్డారు.

Read Also: మనమే ఫేమస్ కపుల్.. మోదీతో ఇటలీ ప్రధాని మెలోని సంభాషణ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>