epaper
Saturday, January 31, 2026
spot_img
epaper

మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం

కలం, వెబ్ డెస్క్​ : మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ (ఎన్సీపీ) నేత భార్య సునేత్రా పవార్ (Sunetra Pawar) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్​ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్​ ఆచార్య దేవవ్రత్ సమక్షంలో ఎలాంటి హడావిడి లేకుండా మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర ప్రమాణం చేశారు. ఆమె భర్త అజిత్​ పవార్​ మరణం తరువాత మహారాష్ట్ర సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి.

జనవరి 28న బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్​ పవార్ (Ajit Pawar)​ మరణించిన విషయం తెలిసిందే. అజిత్ పవార్ ఎన్సీపీలో కీలక నాయకుడిగా, మహాయుతి ప్రభుత్వంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన మరణంతో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఖాళీ అయింది. దీంతో ఉపముఖ్యమంత్రి పదవిలో ఆయన భార్య సునేత్ర పవార్ (Sunetra Pawar)​ ను మహాయుతి కూటమి ఎంపిక చేసింది.

అంతకుముందు ఎన్​సీపీ శాసన సభా పక్ష నేతగా అజిత్​ పవార్​ భార్య సునేత్ర పవార్​ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమర్థించారు. సునేత్రా పవార్ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజిత్​ మరణంతో బారామతి నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ స్థానంలోనే సునేత్ర పోటీ చేసే అవకాశముంది.

Read Also: నాకు చట్ట ప్రకారం నోటీసులివ్వలేదు.. మాజీ సీఎం కేసీఆర్ లేఖ..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>