కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ కోఠిలో కాల్పుల (Koti Gunfire) ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ ATM వద్ద దుండగులు కాల్పులు జరిపి రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు. డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రషీద్‌పై కాల్పులు జరిపారు. కాల్పుల్లో రషీద్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సుల్తాన్ బజార్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించి నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కోఠి ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) రియాక్ట్ అయ్యారు.
కోఠి ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. నిందితులను త్వరితగతిన పట్టుకునేందుకు ప్రత్యేక క్రైమ్ బృందాలు (Special Crime Teams) ఏర్పాటు చేశామన్నారు. ఈ ఘటనకు సంబంధించి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్.ఐ.ఆర్ నం. 28/2026గా కేసు నమోదైందన్నారు. తన స్నేహితుడు అమీర్‌కు చెందిన వాహనంపై కోఠి ఎస్‌బీఐ ప్రధాన శాఖ ఏటీఎంలో రషీద్ నగదు జమ చేస్తుండగా, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో బెదిరించారని తెలిపారు. దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరపగా, రషీద్ కుడి కాలికి గాయమైందని, పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నట్లు సీపీ సజ్జనార్ (CP Sajjanar) తెలిపారు.
Read Also: ఆపరేషన్ స్మైల్.. 5వేల మంది చిన్నారులకు విముక్తి
Follow Us On: X(Twitter)


