Mobile Popup Ad
Mobile Popup Ad

కేరళ బస్సు ఘటన.. మహిళపై ఎఫ్ఐఆర్

కలం, వెబ్ డెస్క్: కేరళ (Kerala) బస్సు ప్రయాణంలో దీపక్ అనే వ్యక్తి అనుచితంగా తాకాడని ఆరోపిస్తూ ఓ మహిళ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో వైరల్ కావడంతో అవమాన భారంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు దీపక్. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు దీపక్ మరణానికి కారణమైన మహిళపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. దీపక్‌ను ఆత్మహత్యకు పురిగొల్పిందని మహిళపై కోజికోడ్ మెడికల్ కాలేజీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

మహిళ తప్పుడు ఆరోపణలు కారణంగా తన కుమారుడు మానసిక వేదన పడ్డాడని దీపక్ తల్లి పోలీసులు ఫిర్యాదు చేసింది. ఆ మహిళపై హత్య అభియోగాలు మోపాలని, దీపక్ మరణానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం పోలీసులు మహిళ కోస గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Kerala
Kerala

Read Also: ప్ర‌యాణిస్తుండ‌గా బ్రేకులు ఫెయిల్‌.. పొలాల్లో బోల్తాకొట్టిన ట్రావెల్స్ బ‌స్సు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>