epaper
Monday, January 26, 2026
spot_img
epaper

ఆటో నుంచి జారిపడి విద్యార్థిని మృతి.. ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా

కలం, వెబ్ డెస్క్ : కామారెడ్డి జిల్లా (Kamareddy) బొర్లం క్యాంపులోని గురుకుల స్టూడెంట్లతో ప్రిన్సిపల్ సునీత ఇంటికి కుర్చీలను తరలించడం.. ఓ విద్యార్థిని ఆటో నుంచి జారిపడి చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. బొర్లం గురుకుల స్కూల్ లో ప్రోగ్రామ్ జరగ్గా.. అక్కడున్న కుర్చీలను ఇన్చార్జి ప్రిన్సిపల్ సునీత ఇంట్లో జరిగే ఓ ఫంక్షన్ కోసం స్టూడెంట్లతో తరలించారు. ఈ క్రమంలోనే ఆటో నుంచి సంగీత అనే 8వ తరగతి విద్యార్థిని జారిపడి చనిపోయింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి సంగీతకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్టు తెలిపారు. బొర్లం గురుకుల స్కూల్ లో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని.. ఇప్పుడే జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక పంపుతామన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.

Read Also: బొగ్గుస్కామ్‌పై బీఆర్ఎస్ దూకుడు.. రేపు గవర్నర్‌కు ఫిర్యాదు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>