కలం, వెబ్ డెస్క్: యంగ్ హీరో శర్వానంద్ తన కొత్త సినిమా నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari)తో హిట్ కొట్టారు. సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ సినిమా అందరి అంచనాలకు మించి విజయాన్ని సాధించింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో పలు స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు హీరో శర్వానంద్(Sharwanand). అందులో భాగంగా టీమ్ మెంబర్స్ తో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శర్వానంద్ బాక్సాఫీస్ నెంబర్స్(Box Office Numbers) గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తనకు బాక్సాఫీస్ నెంబర్స్ కంటే ప్రేక్షకుల ఆదరణే ముఖ్యమని శర్వానంద్ చెప్పారు. ఈ అంకెల గురించి తాను ఏ రోజూ ఏ ప్రొడ్యూసర్‌ను అడగలేదని శర్వానంద్ అన్నారు. శతమానం భవతి సినిమా నుంచే బాక్సాఫీస్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవడం మర్చిపోయానని ఆయన తెలిపారు. థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించడం, ఎన్ని షోస్ యాడ్ చేసినా అవి కూడా నిండటం..ఇవే ఒక సినిమా నిజమైన సక్సెస్ కు ప్రూఫ్ గా నిలుస్తాయని ఈ యంగ్ హీరో చెప్పారు. శర్వా చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
నారీ నారీ నడుమ మురారి సినిమాను దర్శకుడు రామ్ అబ్బరాజు రూపొందించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటించగా…వీకే నరేష్, సునీల్, వెన్నెల కిషోర్, సిరి హనుమంతు, సంపత్ రాజ్ కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఈ సినిమా సక్సెస్ శర్వానంద్ కు మంచి కమ్ బ్యాక్ గా మారింది.


