Mobile Popup Ad
Mobile Popup Ad

మహిళా సంఘాలకు 3,403 ఐకేపీ కేంద్రాలు అప్పగించాం: సీతక్క

కలం, వెబ్ డెస్క్: మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క (Seethakka) స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు (SHGs) పంట కొనుగోలు కేంద్రాల నిర్వహణలో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయని కొనియాడారు. కేవలం ఇంటికే పరిమితం కాకుండా.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే శక్తిగా మహిళలు ఎదిగారని ఆకాంక్షించారు. ఏప్రిల్ నెలాఖరు కల్లా అన్ని ఐకేపీ కేంద్రాలను ప్రారంభించి, మహిళలకు మరింత ఆదాయం వచ్చేలా చేస్తామన్నారు. ఐకేపీ కేంద్రాల ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా, రైతులకు చేరువలో ఉండి పారదర్శక సేవలు అందిస్తున్నారని.. ఇది మహిళా విప్లవానికి నాంది అని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 8,251 ఐకేపీ కేంద్రాల్లో 40 శాతం కంటే ఎక్కువ అంటే 3,403 కేంద్రాలు మహిళా సంఘాలకే అప్పగించామని స్పష్టం చేశారు. గతంలో 1,500 ఉన్న కేంద్రాలను నేడు 3,000 మార్కు దాటించామని వ్యాఖ్యానించారు. గత ఏడాది ఖరీఫ్, యాసంగి సీజన్లలో మహిళా సంఘాలు దాదాపు రూ. 162.25 కోట్ల కమీషన్ సంపాదించడం వారి సమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. మహిళలు నిర్వహిస్తున్న కేంద్రాల్లో పారదర్శకత, సరైన తూకం ఉంటుందని రైతులు నమ్ముతున్నారని తెలిపారు. ఈ కేంద్రాలు 40 లక్షల మంది రైతులకు అండగా నిలుస్తున్నాయని చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>