స‌ర్ ప్ర‌క్రియ‌లో నిర్ల‌క్ష్యం త‌గ‌దు: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

క‌లం, నిర్మ‌ల్‌: ఖానాపూర్ (Khanapur) మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వేను డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bhojju Patel) గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాలను తనిఖీ చేసి, సర్వేను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు, బీఎల్‌వోలకు సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలను ప్రతి ఓటరు పూర్తి వివరాలతో జాగ్రత్తగా నింపి సంబంధిత బీఎల్‌వోలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>