స‌ర్‌ ప్రక్రియలో ప్ర‌తి ఓటరు భాగస్వామి కావాలి: ఆర్డీఓ దేవిదాస్

క‌లం, నిర్మ‌ల్‌: ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రతి ఓటరూ భాగస్వామి కావాలని ఆర్డీఓ దేవిదాస్ (RDO Devidas) అన్నారు. నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లి గ్రామంలో ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2002 ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు అప్పట్లో నమోదైన పేరు, తల్లిదండ్రుల లేదా భర్త పేరు, చిరునామా, కుటుంబ వివరాలు, ఓటరు నమోదు సంఖ్య తదితర వివరాలను పరిశీలించారు.

వాటికి అనుగుణంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేయాలని సూచించారు. అలాగే ప్రతి అర్హుడు ఫారాన్ని సక్రమంగా నింపి ఎన్నికల సిబ్బందికి అందజేసి, ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మార్కింగ్ చేశారు.. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హరీష్, ఉపసర్పంచ్ భూమేష్, తహసీల్దార్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>