కలం, నాగర్ కర్నూల్: మొక్కజొన్న కొనుగోలులో అవినీతి చేశానంటూ ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు చేతనైతే నిరూపించాలని, వాస్తవమని తెలిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని నాగర్ కర్నూల్ మార్కెట్ చైర్మన్ వేనేపల్లి రమణ రావు (Nagar Kurnool Market Chairman Raman Rao) స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కెట్ చైర్మన్ పై చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆరోపణలను దుష్ప్రచారాన్ని ఖండించారు. ఆధారాలు లేని ఆరోపణలతో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను విమర్శిస్తూ బీఆర్ఎస్ నాయకులు బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారని విమర్శించారు.
పెద్దముద్దునూరు గ్రామంలో 473 రైతులతో పీఏసీఎస్ (PACS) ద్వారా 26 వేల 836 కింటాలు 52 వేల సంచులలో కొనుగోలు చేయడం జరిగిందని మార్కెట్ చైర్మన్ అన్నారు. 47 వేల సంచులు ఇచ్చామని,16 సంచులు లారీల ద్వారా తరలించామని.. మిగతా వాటిని టాక్టర్ల ద్వారా నాగనూలు, మంతటికి తరలించామని వివరించారు. ఒక సంచికి పది రూపాయలు చొప్పున 7000 సంచులకు డబ్బులు ఇచ్చారని.. 30 నుంచి 35 రూపాయలు ఇచ్చామని చెప్తున్న దాంట్లో వాస్తవం లేదని, ఎక్కడైనా విచారించవచ్చని అన్నారు.
ఈ సంచులకు నాలుగు లక్షల రూపాయలు అవుతుండగా 44 లక్షల రూపాయలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని కొట్టిపారేశారు. గ్రామానికి వచ్చి రైతులను విచారించాలని నిరూపించాలని మార్కెట్ చైర్మన్ సవాల్ చేశారు. తాను సీఈఓలకు ఫోన్ ద్వారా బెదిరించారని నిరూపిస్తే ఏ శిక్ష కైనా సిద్ధమని, కోట్ల రూపాయల కుంభకోణం అని భూ వివాదాలు సెటిల్మెంట్లు దుష్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
“దేవాలయం మందు రైతులతో మాట్లాడదాం.. రైతుల దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ రైతులు నా ఇంటిని నిర్బంధించండి, నాకు అభ్యంతరం లేదు” అని అన్నారు. ఏ చర్యకైనా తాను సిద్ధమని సవాల్ చేశారు. నాగర్ కర్నూల్ మాజీ శాసనసభ్యులు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి జనార్దన్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేయవద్దని, ఎవరు అభివృద్ధి చేసింది, నీతి చేసింది అందరికీ తెలిసిందేనని అపహాస్యం చేశారు.
తనపై ఆరోపణలు చేస్తున్న మాజీ జెడ్పిటీసీ, బీఆర్ఎస్ నేత శ్రీశైలం మిషన్ భగీరథలో 59 లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడని, పెద్దముద్దునూరు గ్రామంలోని తొమ్మిది లక్షల రూపాయలు మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇత్తడి నల్లాలు ఏర్పాటు చేస్తామని ఇనుప వాటిని అమర్చారని, మాజీ జెడ్పిటిసి కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడో చెప్పాలని రమణారావు డిమాండ్ చేశారు. ఆరోపణలు చేసిన వాటిని నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
ఎమ్మెల్యేను విమర్శించడం సరైనది కాదని, మొక్కజొన్న కొనుగోలు ఐదు సెంటర్లు మండల కేంద్రాలలో ఏర్పాటు చేశారని రెండుసార్లు, సమీక్ష జరిపారని మొక్కజొన్న కొనుగోలు చేస్తున్న సందర్భంలో వచ్చిన సమస్యలను మార్కెట్ చైర్మన్ గా డైరెక్టర్లు అందరం కలిసి రైతులకు అండగా నిలిచి లారీల సమస్య గని బ్యాగుల కొరత క్రమక్రమంగా అన్ని తీర్చామని ఎటువంటి అవినీతికి పాల్పడింది లేదని రమణారావు వివరించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కోటయ్య గోపాల్ రెడ్డి మార్కెట్ డైరెక్టర్ హబీబ్, బిజినపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాములు, వైస్ చైర్మన్ జంగయ్య, కొత్త శ్రీనివాసులు, బుచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి జక్కా రాజు, తదితరులు పాల్గొన్నారు.

