కలం, వరంగల్ బ్యూరో : మేడారం జంపన్న వాగు (Jampanna Vagu) లో పెను ప్రమాదం తప్పింది. సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు జంపన్నవాగులో స్నానం చేసే క్రమంలో లోతులోకి వెళ్లారు. దీంతో ఇద్దరు యువతులు మునిగి కేకలు వేస్తుండటంతో అక్కడే ఉన్న ఎస్డీఆర్ఎఫ్ (SDRF) సిబ్బంది స్పందించి వారిని రక్షించారు. వారిద్దరు ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉండటంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాగు లోతులోకి దిగొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Also: గవర్నర్ అవార్డ్స్‌కు ఎంపికైంది వీరే
Follow Us On: Sharechat


