Mobile Popup Ad
Mobile Popup Ad

వెలుగుమట్ల బాధితులకు పట్టాల పంపిణీ

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల (Velugumatla) బాధితులకు మంత్రులు బుధవారం పట్టాల పంపిణీ చేశారు. పట్టాల పంపిణీ కాదే.. సీఎం రేవంత్ చేతుల మీదుగా నూతన ఇండ్లలో పాలు కూడా పొంగిస్తామని భరోసా కల్పించారు. పట్టాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి (Bhatti Vikramarka) మాట్లాడారు. వెలుగుమట్లలో పేదల కోసం మోడల్ కాలనీ నిర్మిస్తామన్నారు. పేదలకు పంచగా మిగిలిన 16 ఎకరాల భూమిని విద్యా సంస్థల నిర్మాణానికి ఉపయోగిస్తామన్నారు.

భూదాన్ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. రేపటి నుంచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదోడికి ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. అలాగే వివిధ జిల్లాల్లోని 101 మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనుమతి పత్రాలు మంజూరు చేసినట్టు తెలిపారు.

అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) మాట్లాడారు. డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా పేదల ఇండ్లను ప్రారంభిస్తామన్నారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడారు. వెలుగుమట్ల (Velugumatla) బాధితుల పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొసలి కన్నీరు కార్చారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న, వైరా ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్, మేయర్ పూనుకొల్లు నీరజ, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు.

Read Also: మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌కు మేధా పాట్కర్‌ కీలక లేఖ..

Follow Us On: Pinterest

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>