పారిశుద్ధ్య కార్మికుడే.. కానీ ఫార్చునర్‌ కారులో వచ్చి రోడ్లు ఊడ్చుతూ!

కలం, వెబ్ డెస్క్: తపన, అంకితభావం, కష్టపడేతత్వం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించాడు కర్ణాటకు చెందిన శేషప్పణ్ణ (Sheshappanna). 1996 నుంచి పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న శేషప్పణ్ణ తన కష్టంతో, ఆత్మవిశ్వాసంతో గుర్తింపు తెచ్చుకున్నారు. పారిశుద్ధ్య పనితో పాటు పశువుల పెంపకం చేపట్టి నెలకు సుమారు రూ.40 వేల వరకు ఆదాయం సంపాదిస్తున్నాడు. ఒకప్పుడు మద్యానికి బానిసైన ఆయనను ఎస్‌ఐ బెల్లియప్ప చెప్పిన మాటలు ప్రభావితం చేశాయి. మద్యాన్ని వదిలి జీవితాన్ని కొత్తగా ప్రారంభించారు. అప్పటి నుంచి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేశారు.

కార్లంటే ప్రత్యేకమైన ఇష్టం ఉన్న శేషప్పణ్ణ తన కలను సాకారం చేసుకునేందుకు ఒక్కో మెట్టు ఎక్కాడు. తొలుత లోన్‌ తీసుకుని ఆల్టో కారును కొనుగోలు చేసిన ఆయన, ఆ తర్వాత స్కార్పియో, చివరికి ఫార్చునర్‌ కారును సొంతం చేసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూనే తన కష్టార్జితంతో ఫార్చునర్‌లో తిరుగుతున్న శేషప్పణ్ణ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పని చిన్నదా పెద్దదా అనేది కాదు.. ఎదగాలనే తపన, కష్టపడే మనస్తత్వం ఉంటే జీవితాన్ని మార్చుకోవచ్చని శేషప్పణ్ణ ప్రయాణం నిరూపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>