తమిళనాడు సీఎం విజయ్ కీలక ప్రకటనలు

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ వేదికగా ఆ రాష్ట్ర సీఎం జోసెఫ్ విజయ్ (CM Vijay) వరాల జల్లు కురిపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు అన్ని ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం , అలాగే అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు అందించనున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు మహిళలు, ట్రాన్స్ జెండర్ల ఉచిత ప్రయాణం కోసం ‘వెట్రి పయనం తిట్టం’ పథకాన్ని సీఎం విజయ్ ప్రకటించారు. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న ఈ పథకం అమల్లోకి రానుందని వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఎక్స్ ప్రెస్, లిమిటెడ్ స్టాప్ సర్వీస్, డీలక్స్ సర్వీసుల బస్సుల్లోనూ మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చని వివరించారు.

అలాగే అన్నపూర్ణి సూపర్ సిక్స్ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లను వచ్చే ఏడాది పొంగల్ పండుగ నుంచి అమలు చేస్తామని సీఎం విజయ్ (CM Vijay) చెప్పారు. అంతేకాదు చెన్నై శివార్లలో పరందూర్‌లో రెండో విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల వ్యతిరేకత నేపథ్యంలో పరందూర్ ఎయిర్‌పోర్టు ప్రతిపాదన రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. విమానాశ్రయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నిరసనకారులకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు.

Also Read : ‘నువ్వు పోతే మీ ఇంటికి ఎవరు దిక్కు?’.. మరో వివాదంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>