Mobile Popup Ad
Mobile Popup Ad

రేవంత్ రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం: మాజీ మంత్రి రోజా

కలం, వెబ్ డెస్క్ : రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు (Chandrababu) రాష్ట్ర ప్రయోజనాలను పొరుగు రాష్ట్రానికి తాకట్టు పెడుతున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందాలు చేసుకున్నారని చెప్పారు. ఈ మేరకు తిరుపతిలో జరిగిన రాయలసీమ ఎత్తిపోతల పథకం చర్చా వేదికలో పాల్గొన్న ఆర్కే రోజా తాజా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాయలసీమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను అటకెక్కిస్తూ చంద్రబాబు ఈ ప్రాంత అభివృద్ధిని అట్డుకుంటున్నారని రోజా (RK Roja) ఫైర్ అయ్యారు. సీమ ప్రాజెక్టులకు కనీసం రెండు వేల కోట్లు కేటాయించలేని వ్యక్తి.. అమరావతికి రూ. 2 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు చర్యల వల్ల రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందన్న రోజా.. సీమ ప్రజలు ఈ వివక్షను గమనిస్తున్నారని హెచ్చరించారు. సొంతం ప్రాంతం పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. అటు రాజధాని అమరావతి అనేది చంద్రబాబు సృష్టించిన పెద్ద స్కామ్ అని.. రాజధాని అమరావతిని పూర్తి చేసేందుకు 105 ఏళ్లు పడుతుందని రోజా తెలిపారు.

Read Also: కల్పక్కం రియాక్టర్‌పై వైఎస్ జగన్ ప్రశంసలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>