Mobile Popup Ad
Mobile Popup Ad

కల్పక్కం రియాక్టర్‌పై వైఎస్ జగన్ ప్రశంసలు

కలం, వెబ్ డెస్క్ : భారత అణుశక్తి రంగంలో చారిత్రాత్మక ఘట్టం నమోదైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్  మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని దేశ శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల కృషిని ప్రశంసిస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

కల్పక్కం (Kalpakkam) లో నిర్మించిన స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) విజయవంతంగా “ఫస్ట్ క్రిటికాలిటీ” సాధించడం భారత అణుశక్తి ప్రయాణంలో గొప్ప ముందడుగు. ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసిన ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (IGCAR), భారతీయ నాభికియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (BHAVINI), అలాగే డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE) బృందాల అంకితభావాన్ని ఆయన కొనియాడారు.

500 మెగావాట్ల సామర్థ్యంతో రూపొందిన ఈ రియాక్టర్.. శుద్ధమైన, భద్రమైన విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమం చేస్తుంది. అంతేకాకుండా, భారతదేశంలో విస్తారంగా లభించే థోరియం వనరులను వినియోగించుకునే దిశగా ఇది కీలక అడుగని తెలిపారు. ఇది నిజంగా ప్రతి భారతీయుడికి గర్వకారణం అని జగన్ (YS Jagan) పేర్కొన్నారు.

Read Also: మావిగన్‌పై పచ్చ మీడియాలో తప్పుడు ప్రచారం: యాంకర్ శ్యామల

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>