కలం, వెబ్ డెస్క్: ఏపీలోని పల్నాడు జిల్లా మాదమంచిపాడు తిరునాళ్లలో యాంకర్ శ్యామల (Anchor Shyamala) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కొనియాడారు. విజయవాడను ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లిన అద్భుతమైన నాయకుడు జగన్ (YS Jagan) అని ప్రశంసించారు. ముఖ్యంగా మావిగన్ కారిడార్ రాష్ట్ర అభివృద్ధికి శక్తివంతమైన వృద్ధి ఇంజన్‌లా మారుతుందని చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేసే అద్భుతమైన అవకాశం దీని ద్వారా లభిస్తుందని శ్యామల స్పష్టం చేశారు.
‘మావిగన్’ (MAVIGUN) ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలనూ శ్యామల (Anchor Shyamala) తిప్పికొట్టారు. ఈ ప్రాజెక్టు గురించి ‘ఎల్లో మీడియా’ కావాలనే తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జగన్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని శ్యామల పేర్కొన్నారు.
Read Also: రేవంత్ రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం: మాజీ మంత్రి రోజా
Follow Us On : WhatsApp

