ఇరాన్‌పై మళ్లీ చమురు ఆంక్షలు.. ట్రంప్ సంచలన నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతూ ఇరాన్‌పై అమెరికా ప్రభుత్వం చమురు ఆంక్షల (US oil sanctions) అస్త్రాన్ని మరోసారి ప్రయోగించింది. ఇరాన్ చమురు ఉత్పత్తి, విక్రయాలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆంక్షల మినహాయింపును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పూర్తిగా రద్దు చేశారు.

దీనితో పాటు ఓఎఫ్ఏసీ (OFAC) జనరల్ లైసెన్స్‌ను కూడా తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందం (MoU) అనేది పూర్తిగా ఇరాన్ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ గనుక అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌తో పాటు గల్ఫ్ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>