కలం, ఖమ్మం బ్యూరో: పాదయాత్ర (Padayatra) కాదు, పరిగెత్తే యాత్ర కూడా ప్రజలు చేయిస్తారని ఎంపీ రేణుకా చౌదరి (Renuka Chowdhury).. కేటీఆర్ (KTR)ను ఉద్దేశించి విమర్శించారు. సోమవారం భద్రాచలంలో ఐదు గ్రామాల విలీనం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కేటీఆర్ పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పాద యాత్ర వలన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మెక్కి తిన్నదంతా అరుగుతుందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడదని, బీఆర్‌ఎస్‌కు కరప్షన్ వెన్నతో పెట్టిన విద్య అని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, డబుల్ బెడ్ రూం ఇళ్లలో అవినీతి, వేల ఎకరాల భూముల కుంభకోణాలు బీఆర్ఎస్ హయంలో జరిగిన విషయం వారు మర్చిపోయారా? అని ఆమె (Renuka Chowdhury) ప్రశ్నించారు. ఎండలో పాద యాత్ర ఆరోగ్యానికి మంచిదన్నారు.
Read Also: అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్‌పై రామ్ చరణ్.. స్టైలిష్ లుక్స్ అదుర్స్
Follow Us On: X(Twitter)

