కలం, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ ఏప్రిల్ 2026 ఎడిషన్ కవర్ పేజీపై ఆయన మెరిశారు. హాంకాంగ్‌లో జరిగిన ఈ ప్రత్యేక ఫోటోషూట్‌లో చరణ్ గతంలో ఎన్నడూ చూడనివిధంగా స్టైలిష్‌గా కనిపించారు. పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించి అభిమానులను అలరించారు. ఈ కవర్ ఫోటోలో (Cover Photo) చరణ్‌తోపాటు ఆయన పెంపుడు కుక్క రైమ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామ్ చరణ్ ప్రస్తుత చిత్రం పెద్ది కోసం పెంచుకున్న హెయిర్ స్టైల్, గడ్డంతోనే ఈ షూట్‌లో పాల్గొనడం విశేషం. భారతీయ సినిమా గర్వించదగ్గ నటుల్లో చరణ్ ఒకరు అని ఈ మ్యాగజైన్ ప్రశంసించింది.
Read Also: అండర్ ట్రయల్ ఖైదీ.. జైల్లోనే బందీ!
Follow Us On: Instagram

