కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) కార్పొరేషన్ పరిధిలో హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించిన వాహనదారులకు పోలీసులు పూలతో అభినందనలు తెలిపారు. అలాగే నిబంధనలు పాటించని వారికి అవేర్‌నెస్ క్లాస్ తీసుకున్నారు. ఏసీపీ రమణ మూర్తి పర్యవేక్షణలో సోమవారం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఖమ్మం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు, మరణాల రేటును తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
రోడ్డు భద్రత నియమాలు పాటించేలా ప్రజలను సమయాత్తం చేసేందుకు హెల్మెట్, సీటు బెల్ట్ ధరించిన వారిని అభినందిస్తున్నామన్నారు. తద్వారా ఇతరులను కూడా ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రాణ రక్షణ ముఖ్యం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనాదారులతో పాటు వెనుక కూర్చునే వారు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. కార్లు నడిపే వాహనదారులు తప్పనిసరిగా సీట్ బెల్టు ధరించాలని సూచించారు. అలాగే ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్ చేయడం నిబంధనలకు విరుద్ధమని, ఓవర్‌టేక్ కేవలం కుడి వైపు నుండి మాత్రమే చేయాలని హెచ్చరించారు. వీటితో పాటు రక్షణాత్మక డ్రైవింగ్ పై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్ఐలు, కానిస్టేబుల్‌లు పాల్గొన్నారు.
Read Also: టైటిల్ కోసం అన్నా చెల్లెళ్ల ఫైట్.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ
Follow Us On: X(Twitter)

