Mobile Popup Ad
Mobile Popup Ad

ఐపీఎల్ తొలి మ్యాచ్.. టాస్ గెలిచిన ఆర్సీబీ

కలం, వెబ్ డెస్క్: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ఐపీఎల్ 2026 (IPL 2026) మహాసంగ్రామం షురూ అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (RCB vs SRH) జట్ల మధ్య తొలి పోరు మొదలైంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ మొదటగా బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో ఇషాన్ కిషన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.

సుదీర్ఘ నిరీక్షణకు తెర తెరదించుతూ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ కప్ ను ముద్దాడింది. దీంతో ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బెంగళూరులో విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(c), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ ఆటగాళ్లు ఆడుతున్నారు. అటు సన్‌రైజర్స్ హైదరాబాద్ లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w/c), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ ప్లేయింగ్ 11లో చోటు సంపాదించుకున్నారు.

బెంగళూరు హోమ్ గ్రౌండ్ కావడంతో ‘ఆర్సీబీ.. ఆర్సీబీ..’అంటూ ప్రేక్షకులు స్టేడియంలో నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అయితే తొలుత బ్యాటింగ్ చేస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తన బ్యాటింగ్ సత్తాతో ప్రత్యర్థి జట్టుకు భారీ టార్గెట్ ను నిర్దేశిస్తుందా? లేదా? అనేది మరికాసేపట్లో తేలనంది.

Read Also: ఈ అలవాట్లే ఆఫీసులో మీ ఇమేజ్‌ను తగ్గిస్తున్నాయ్‌..!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>