Mobile Popup Ad
Mobile Popup Ad

ఆస్తి పన్నుల చెల్లింపులపై దృష్టి పెట్టండి: కలెక్టర్

కలం, వరంగల్ బ్యూరో: ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్నుల చెల్లింపులపై దృష్టి సారించి వసూళ్లు చేపట్టాలని అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్, ఇంచార్జ్ బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ (Collector Chahat Bajpai) ఆదేశించారు. శనివారం వరంగల్ పరిధిలోని కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయ ఆవరణలో గల ఈ-సేవా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న పన్ను వసూళ్ల విధానాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయ ఆవరణలో గల ఈ-సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పన్నుల సేకరణ తీరును, ప్రభుత్వ ఆస్తుల బిల్లుల చెల్లింపు తదితర అంశాలను అడిగి తెలుసుకొని మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నగర పరిధిలోని బకాయిలు పడి ఉన్న రైల్వే, పోస్టాఫీసులు, కేఎంసీ తదితర ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు అందజేసి వెంటనే పన్నులు చెల్లించేలా చర్యలు చేపట్టలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, రెవెన్యు అధికారులు రావుల ఆనంద్, శ్రీనివాస్, ఆర్ఐ సోహైల్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: శోభాయాత్రలో రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>