కలం, వెబ్ డెస్క్: జనతా గ్యారేజ్ సినిమాలో చెప్పినట్లు మనం మన కుటుంబాలకన్నా ఆఫీసు కో-వర్కర్స్‌తోనే ఎక్కువ సమయం గడుపుతాం. అందుకే మన ఆఫీసుకు కూడా మరో కుటుంబంలా మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో మనకు తెలియకుండానే చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు, పని ప్రదేశంలో అలవాట్లు (Workplace Habits) మన వృత్తిపరమైన ఎదుగుదలను దెబ్బతీస్తాయి. ఆఫీసులో కేవలం పని మాత్రమే కాదు, మన ప్రవర్తన కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ఒక మంచి లీడర్‌గా ఎదగాలంటే కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ముందుగా, ఒక సక్సెస్ క్రెడిట్‌ను మొత్తం మీరే తీసుకోకూడదని, అలాగే ఓటమి ఎదురైనప్పుడు తప్పును సహోద్యోగులపై నెట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విజయం సాధించినప్పుడు టీం సభ్యుల కృషిని గుర్తించేవారే నిజమైన నాయకులని, విఫలమైనప్పుడు బాధ్యతను పంచుకునేవారికే అందరూ అండగా ఉంటారని పేర్కొంటున్నారు. అలాగే ఇతరుల పనితీరుపై అనవసరంగా నిఘా పెట్టడం లేదా చిన్న చిన్న తప్పులను ఎత్తిచూపడం వంటి పనులు చేయకూడదు. తోటివారికి సహాయం చేయాలే తప్ప, వారి పనులను పర్యవేక్షించే ‘హాల్ మానిటర్’లా వ్యవహరించడం వల్ల బంధాలు దెబ్బతింటాయని చెప్తున్నారు.
పనిలో పొరపాట్లు జరిగినప్పుడు సాకులు చెప్పడం మానేయాలని, నిజాయితీగా తప్పును ఒప్పుకుని దానిని సరిదిద్దుకునే ప్రణాళికను వివరించాలని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ పరిణతిని చూపిస్తుంది. ఇక ఆఫీసులో గాసిప్స్ చెప్పడం ఒక ట్రాప్ లాంటిదని, ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారిని ఎవరూ నమ్మరని గుర్తుంచుకోవాలి. వ్యక్తిగత సమస్యలను ఆఫీసులో (Workplace Habits) పంచుకోవడం వల్ల మీకు ‘హై డ్రామా’ అనే ముద్ర పడే అవకాశం ఉంది. ప్రమోషన్ల విషయంలో యాజమాన్యం ఎప్పుడూ మానసిక స్థిరత్వం ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తుందని గమనించాలి.
చివరగా, ఆఫీసులో మీ గౌరవం అనేది మీరు ఇచ్చే ప్రజెంటేషన్ మీద మాత్రమే కాకుండా, ప్రతిరోజూ ఇతరులతో మీరు ఎలా మెలుగుతారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ చిన్నపాటి మార్పులు చేసుకుంటే మీరు పనిచేసే చోట అత్యంత గౌరవనీయమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు.
Read Also: దంతాలు దృఢంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Follow Us On: Instagram

