Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు

కలం, హనుమకొండ :  కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటోందని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ (MP Laxman) తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం హనుమకొండలోని (Hanumakonda) ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీజేపీ తలపెట్టిన సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, మహిళా రిజర్వేషన్ బిల్లు, పునర్విభజన బిల్లును అడ్డుకున్న పార్టీలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని విమర్శించారు. పునర్విభజన బిల్లు ద్వారా పార్లమెంట్ స్థానాలు తగ్గుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటుగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రజల పరిస్థితి “పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు” అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులలో  ప్రజలు మోదీ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు.

అంతేకాకుండా, బెంగాల్‌లో గెలిచిన నెల రోజులలోనే మార్పు చూపిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నెల 29న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నభీన్ వరంగల్ సభకు రానున్నారని తెలిపారు. మత మార్పిడి చేసుకున్నవారికి రిజిస్ట్రేషన్ వర్తించదన్న చెన్నై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు  చెప్పారు. ఒక వర్గం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ మతతత్వ పార్టీనా లేక ప్రజాస్వామ్య పార్టీనా అని ప్రశ్నించారు. SIR ద్వారా రోహింగ్యాల ఓట్లు తొలగిపోతాయన్న భయంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఆందోళన నెలకొందని ఆయన విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మోదీ హయంలో ఖచ్చితంగా ఆమోదం పొందుతుందని  ఆశాభావం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>