epaper
Monday, January 26, 2026
spot_img
epaper

‘ఇరుముడి’ తో రవితేజ.. ఈ సారి సరికొత్తగా

కలం, సినిమా : మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాత్ర ఏదైనా అద్భుతమైన ఎనర్జీతో అదరగొట్టే పర్ఫామెన్స్ తో రవితేజ ఎంతగానో ఆకట్టుకుంటాడు. గతంలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజ. ఈ మధ్య సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. సరికొత్త పాత్రలతో ప్రేక్షకులను థ్రిల్ చేసే రవితేజ కొంత కాలంగా మూసకొట్టు కథలతో, రొటీన్ లుక్స్ తో వరుస ఫ్లాప్స్ అందుకుంటున్నాడు. ఫ్యాన్స్ సైతం మా రవన్న సాలిడ్ హిట్ ఎప్పుడు కొడతాడా అని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.

వరుసగా మాస్ కథలతో వచ్చిన రవితేజ ఈ సంక్రాంతికి తన స్టైల్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “భర్త మహాశయులకు విజ్ఞప్తి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాగున్నప్పటికి ఫ్యాన్స్ రవితేజ నుంచి మరింత కొత్తదనం ఆశిస్తున్నారు. దీనితో మాస్ మహారాజ్ రూటు మార్చారు. సరికొత్త కథలను ఎంపిక చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా రవితేజ డైరెక్టర్ శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో “ఇరుముడి”(Irumudi) అనే సినిమా చేస్తున్నారు.

నేడు రవితేజ బర్త్ డే సందర్భంగా “ఇరుముడి” (Irumudi) ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. అయ్యప్ప స్వామి మాలలో రవితేజ లుక్ అదిరిపోయింది. ఈ సందర్భంగా రవితేజ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.కొన్ని కథలు మనం వెతకము.. సరైన సమయానికి మనల్నే వెతుక్కుంటూ వస్తాయి. ఆ క్షణంలో నమ్మకం ఒక్కటే దారి చూపుతుంది. అదే నమ్మకంతో మళ్లీ ఒక కథలో భాగం కావడం దైవ ఆశీర్వాదంలా అనిపిస్తుంది. ఇది కేవలం ప్రయాణం కాదు.. భక్తి, విశ్వాసం, అర్పణతో మొదలయ్యే ఒక అనుభవం అని రవితేజ ట్వీట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ సరికొత్త కథాంశాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తుంది. టక్ జగదీష్, ఖుషీ సినిమాల తరువాత గ్యాప్ తీసుకున్న శివ నిర్వాణ రవితేజకి “ఇరుముడి” తో సాలిడ్ హిట్ ఇస్తారేమో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>