Mobile Popup Ad
Mobile Popup Ad

‘పెద్ది’ గురించి రామ్ చరణ్‌ను అడిగిన ప్రధాని మోదీ

కలం, వెబ్ డెస్క్: పెద్ది (Peddi) మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. దిల్లీలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్​ సహా నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘చివరిసారి దిల్లీకి వచ్చినప్పుడు ప్రధాని మోదీని కలిశాను. పెద్ది సినిమా కాన్సెప్ట్ ఏంటని అడిగారు. వికసిత్‌ భారత్ నేపథ్యంలో గ్రామాల్లో జరిగే కథ అని వివరించాను. అప్పుడు ప్రధాని మోదీ నాకో ఆసక్తికరమైన స్టోరీ చెప్పారు.

50 ఏళ్ల కిందట ప్రధాని మోదీ (West Bengal) బెంగాల్‌‌లో ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు ఓ గ్రామానికి వెళ్లినట్లు గుర్తు చేసుకున్నారు. అక్కడ ఓ వ్యక్తి ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించాడు. ఆయన భారత జాతీయ జట్టుకు కూడా ఆడాడు. అతడి పేరు మహమ్మద్. తరువాత కాలంలో ఆ ఊరు నుంచే 85 మంది ఫుట్ బాల్ క్రీడాకారులు దేశానికి ఆడినట్లు ప్రధాని మోదీ నాకు చెప్పారు’ అని రామ్ చరణ్ వివరించారు. పెద్ది (Peddi) మూవీ కూడా అదే తరహాలోనిది. మారమూల గిరిజన ప్రాంతానికి చెందిన కుర్రాడు.. తన అస్తిత్వం కోసం ఏం చేశాడనేదే ఈ చిత్ర కథ అన్నారు.

Read Also: గులాబీ పెదవుల సీక్రెట్.. ఇంట్లోనే ఇలా చేసుకుంటే చాలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>