Mobile Popup Ad
Mobile Popup Ad

గులాబీ పెదవుల సీక్రెట్.. ఇంట్లోనే ఇలా చేసుకుంటే చాలు!

కలం, వెబ్‌డెస్క్: నవ్వు ముఖానికి అందాన్ని ఇస్తే.. గులాబీ రంగు పెదవులు (Lips) ఆ నవ్వుకు మరింత నిండుదనాన్ని ఇస్తాయి. కానీ మారుతున్న వాతావరణం, కాలుష్యం, డీహైడ్రేషన్, కెమికల్స్ ఎక్కువగా ఉండే లిప్‌స్టిక్‌ల వాడకం వల్ల చాలా మంది పెదవులు నల్లగా, జీవం లేకుండా మారిపోతుంటాయి. పెదవుల నలుపును వదిలించుకుని, మళ్లీ వాటి సహజమైన గులాబీ రంగును తిరిగి పొందడానికి ఇంట్లో దొరికే వస్తువులతోనే కొన్ని మిశ్రమాలు తయారు చేసుకోవచ్చట. క్రమం తప్పకుండా లిప్ కేర్ (Lip Care) చిట్కాలను పాటిస్తూ, రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉండి పెదాలు ఎల్లప్పుడూ మృదువుగా, గులాబీ రంగులో మెరుస్తాయని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.

బీట్‌రూట్ రసం

బీట్‌రూట్‌లో ఉండే సహజమైన పిగ్మెంట్ పెదవులకు తక్షణ గులాబీ రంగును ఇస్తుంది. ఒక చిన్న బీట్‌రూట్ ముక్కను తీసుకుని పెదవులపై కాసేపు తేలికగా మసాజ్ చేయాలి. లేదా బీట్‌రూట్ రసాన్ని రాత్రి పూట పెదవులకు రాసుకుని పడుకోవచ్చు. ఇది పెదాల నలుపును చాలా వేగంగా తగ్గిస్తుంది.

నిమ్మరసం, తేనె

నిమ్మకాయలో సహజ బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మంపై నలుపును తొలగించడంలో సహాయపడతాయి. తేనె పెదవులకు అవసరమైన తేమను అందిస్తుంది. ఒక చిన్న గిన్నెలో అర చెంచా నిమ్మరసం, అర చెంచా తేనె కలిపి మిశ్రమంలా చేయాలి. దీనిని రాత్రి పడుకునే ముందు పెదవులపై రాసి, మరుసటి రోజు ఉదయం చల్లని నీటితో కడిగేయాలి.

చక్కెర, ఆలివ్ ఆయిల్ స్క్రబ్

పెదవులపై మృతకణాలు (Dead Cells) పేరుకుపోవడం వల్ల కూడా అవి నల్లగా కనిపిస్తాయి. అందువల్ల వారానికి రెండు సార్లు స్క్రబింగ్ చేయడం ముఖ్యం. ఒక చెంచా చక్కెరలో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె కలిపి పెదవులపై గుండ్రంగా 2-3 నిమిషాల పాటు మెల్లగా రుద్దాలి. ఇది పెదాలను మృదువుగా మార్చడమే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచుతుంది.

పాలు, పసుపు

పచ్చి పాలలో కొద్దిగా పసుపు కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను పెదవులపై రాసి 5-10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. అది ఆరిన తర్వాత మెల్లగా రుద్దుతూ కడిగేయాలి. పసుపులో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు, పాలలోని లాక్టిక్ యాసిడ్ పెదాల రంగును మెరుగుపరుస్తాయి.

Read Also: గంటల తరబడి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చూస్తున్నారా? ఈ సమస్య ఖాయం!

Read Also: డిజిటల్​ విప్లవం

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>