Mobile Popup Ad
Mobile Popup Ad

ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ల్లే సుగాలి ప్రీతికి న్యాయం జ‌రిగింది: హైప‌ర్ ఆది

క‌లం, వెబ్ డెస్క్: ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన సుగాలి ప్రీతి (Sugali Preethi) కేసు గురించి జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది (Hyper Aadi) తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సుగాలి ప్రీతికి ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ల్లే న్యాయం జరిగింద‌ని ఆది పేర్కొన్నారు. కొద్ది రోజులుగా సుగాలి ప్రీతి త‌ల్లి చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై ఆది తీవ్రంగా స్పందించారు. పక్కన వాళ్ల మాటలు విని పవన్‌ను విమర్శించడం మానేస్తే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ విష‌యంపై మాట్లాడ‌టం వ‌ల్లే కేసు గురించి బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్నారు. పాప‌కు జ‌రిగిన అన్యాయం గురించి అంద‌రికీ తెలియ‌డం వ‌ల్లే ప్ర‌భుత్వం స్పందించి భూమి, ఉద్యోగం ఇచ్చాయ‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ విష‌యం గురించి మాట్లాడ‌టం వ‌ల్లే ఇవ‌న్నీ జ‌రిగాయ‌ని, ఆయ‌న మాట్లాడ‌క ముందు ఎందుకు ప్ర‌భుత్వం ఇవ‌న్నీ చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే భ‌యం ఉండ‌టం వ‌ల్లే ఇదంతా సాధ్య‌మైంద‌ని, ఆయ‌న ప్రోద్భ‌లంతోనే సీబీఐ ఎంక్వైరీ వ‌ర‌కు వెళ్లింద‌ని చెప్పారు. చార్జ్ షీట్లో పేర్లు మార్చేసి, సీబీఐకి కూడా అంతు చిక్క‌కుండా చేశార‌న్నారు. అలాంటి కేసు గురించి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంకా ఎంత కాలం పోరాడ‌తార‌ని ప్ర‌శ్నించారు.

ఓట్ల కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ సుగాలి ప్రీతి కేసును వాడుకున్నార‌ని ఎలా అంటున్నార‌ని నిల‌దీశారు. నెల‌కి త‌న‌కు వ‌స్తున్న జీతంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్ర‌తి రూపాయి పిఠాపురంలో పిల్ల‌ల కోసం ఇస్తున్న ప‌వ‌న్ ఓట్ల కోసం ఒక ఇష్యూని వాడుకుంటారా అని ప్ర‌శ్నించారు. ఎవ‌రు ఏ స‌హాయం అడిగినా స్పందించే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓట్ల కోసం ఇలా చేస్తార‌ని ఎలా అంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాలు పోసే వ్య‌క్తిని కాటేసే మ‌న‌స్త‌త్వం మీకు ఎలా వ‌చ్చిందో నాకు అర్థం కావ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ప్ప‌ ఎవ‌రైనా న్యాయం చేస్తే జీవితంలో జ‌న‌సేన గురించి మాట్లాడ‌న‌ని వ్యాఖ్యానించారు. ప‌క్క‌న వాళ్ల మాట‌లు విని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను విమ‌ర్శించ‌డం మానుకోవాల‌ని సూచించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ గురించి ఎవ‌రేం మాట్లాడినా అభిమానులు ఊరుకోర‌ని, క‌చ్చితంగా స్పందిస్తార‌ని హైప‌ర్ ఆది (Hyper Aadi) స్ప‌ష్టం చేశారు.

Read Also: ‘పెద్ది’ గురించి రామ్ చరణ్‌ను అడిగిన ప్రధాని మోదీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>