కలం, వెబ్ డెస్క్ : రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sreedhar) ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను(Pawan Kalyan) కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. గత కొంతకాలంగా మహిళా ఉద్యోగిని హర్షవీణ వ్యవహారం, వేధింపుల ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తూ ఆందోళనలు కూడా చేపట్టాయి. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. తాజాగా పవన్ కల్యాణ్‌ను కలిసిన అరవ శ్రీధర్ తనపై వచ్చిన ఆరోపణల గురించి వివరించారు. వ్యక్తిగత కారణాలతోనే విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

