వెంగ్వాపేట్‌లో ధాన్య నిల్వ గోదాంకు శంకుస్థాపన

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) రూరల్ మండలం వెంగ్వాపేట్ (Vengwapet) గ్రామంలో రైతులకు ఉపయోగపడే మరో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆహార ధాన్యాల నిల్వ గోదాంకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు గోదాములు ఎంతో అవసరమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.

రైతుల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం గ్రామంలో ఇటీవల మంజూరైన పలు అభివృద్ధి పనులను పరిశీలించి, పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ  (Vengwapet) సర్పంచ్, బీజేపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also: దంపతులైనా సరే.. ఈ వస్తువులు మాత్రం అస్సలు పంచుకోవద్దు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>