Mobile Popup Ad
Mobile Popup Ad

SIR ఫారాల డిజిటలీకరణ గడువులోగా పూర్తి చేయాలి: నిర్మల్ కలెక్టర్

కలం, నిర్మల్: SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఫారముల డిజిటలీకరణ గడువులోగా పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ (Nirmal Collector) భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట్‌లో జరుగుతున్న SIR ప్రక్రియను పరిశీలించారు. ఓటర్లు నింపి, తిరిగి ఇచ్చిన SIR ఫారముల డిజిటలికరణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

బీఎల్ఓలు డిజిటలీకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు పూర్తిచేసిన డిజిటలైజేషన్ వివరాలను బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. బీఎల్ఓలు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఓటర్ల ఇంటికి వెళ్లి, నింపిన ఫారములను తిరిగి తీసుకోవాలని చెప్పారు. SIR ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.

సూపర్వైజర్లు ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని తెలిపారు. స్థానికంగా నివాసం ఉన్న ఓటర్ల ఇంటికి వెళ్లి, వారు SIR ఫారములు నింపుతున్న తీరును పరిశీలించారు. స్థానికులతో మాట్లాడుతూ.. SIR ప్రక్రియ పై ఏవైనా సందేహాలు ఉంటే, హెల్ప్ డెస్క్‌లో అధికారుల సహాయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దేవీదాస్, మున్సిపల్ కమిషనర్ రవి బాబు, తహశీల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>