కలం, వెబ్ డెస్క్ : రైల్వేశాఖలో ఎగ్జామ్ లేకుండా ఉద్యోగాలు (Railway Jobs) ఉన్నాయి. గ్రూప్-సి, గ్రూప్-డి విభాగాల్లో మొత్తం 54 పోస్టులకు సౌత్ ఈస్టర్న్ రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి స్పోర్ట్స్ కోటాలోని వారే అర్హులు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ లాంటి ఆటల్లో స్ఫూర్తి కనబర్చిన వారు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చేసిన వారిలో ఎవరైనా అర్హులే. 10 జనవరి 2026 నుంచి ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవారు rrcser.co.in వెబ్ సైట్ కు వెళ్లి డీటేయిల్స్ ఎంటర్ చేయాలి. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లాక మీకున్న అర్హత ప్రమాణాలు, సాలరీ, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ స్టేటస్ లు, అఫీషియల్ నోటిఫికేషన్ ఫార్మ్ కు లింక్ కూడా కనిపిస్తుంది. వాటిని ఫాలో అవుతూ అప్లై చేసుకుంటే సరిపోతుంది.

Read Also: సీనియర్ సిటిజెన్స్‌కు బెస్ట్ ఎఫ్‌డీలు ఇవే!
Follow Us On: X(Twitter)


